Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    సీఎం జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. ఆ వ్యాఖ్యలు ఏంటని..

    కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత సాధినేని యామిని తప్పుబట్టారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కరోనాకు ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ చాలని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు.

    news18-telugu
    Updated: March 17, 2020, 9:35 AM IST
    సీఎం జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. ఆ వ్యాఖ్యలు ఏంటని..
    ఏపీ సీఎం వైఎస్ జగన్
    • Share this:
    కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత సాధినేని యామిని తప్పుబట్టారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కరోనాకు ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ చాలని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కొనడానికి పారసిటమాల్ వేసుకుంటే.. అది ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా వైరస్ చనిపోతుందని చెప్పడం హాస్యాస్పదమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాతో లక్షలాది మంది బాధపడుతున్నారని, దేశంలోనూ వేగంగా వైరస్ విస్తరిస్తోందని అన్నారు. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలు సరికావని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారామె.
    సాదినేని యామిని శర్మ,బీజేపీలో చేరిన సాదినేని యామిని,సాదినేని యామిని టీడీపీ,sadineni yamini,sadineni yamini joins bjp,sadineni yamini news,
    సాధినేని యామిని (File)

    అటు.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సింది పోయి.. స్థానిక ఎన్నికలే ముఖ్యమనే విధంగా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నారని యామిని ఆరోపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు కులం అంటగడుతూ, ఆయన్ను ఏక వచనంతో సంబోధించడం ఎంత మాత్రం సబబు కాదని సీఎంను విమర్శించారు.
    Published by: Shravan Kumar Bommakanti
    First published: March 17, 2020, 9:35 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading