ఏముందని కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు?.. నారాయణపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్

బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

సీపీఐ నేత నారాయణపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి హిందువులను అవమానించే నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 • Share this:
  సీపీఐ నేత నారాయణపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి హిందువులను అవమానించే నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలకు వయసు అయిపోయిందని.. నారాయణకు కూడా వయసు అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టు మాటలకు చేతలకు ఏనాడు పొంతన ఉండని ఆరోపించారు. గాంధేయవాదం గురించి మాట్లాడి.. గాంధీ జయంతి రోజే హింసా మార్గాన్ని ఎంచుకుని చికెన్ తింటారని ఎద్దేవా చేశారు. దేవాలయాల గురించి దొంగ ఎడుపులతో ప్రకటనలు ఇచ్చారని.. మళ్లీ కుటుంబం సమేతంగా తిరుమలకు వెళ్లారని చెప్పారు.

  తిరుమలలో నారాయణ కుటుంబం రాతిని చూశారా? లేదా వెంకటేశ్వర స్వామిని చూశారా? అని ప్రశ్నించారు. అసలు తిరుమలలో ఏముందని నారాయణ కుటుంబం దర్శించుకున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. దేవుళ్లను అవమానించడం కమ్యూనిస్టులకు అలవాటుగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో దేవాలయంను రక్షించమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి గుర్తుచేశారు. దేవుళ్లను రాతితో పోల్చే కమ్యూనిస్టులకు దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.

  అసలు ఆయన పేరులోనే "నారాయణ(వెంకటేశ్వరస్వామి)" ఉందని తెలుసుకోవాలని నారాయణకు హితవు పలికారు. నారాయణ పేరు కూడా ఆయన అంటున్న రాతి పేరేనని.. మరి ఆయన పేరు మార్చుకుంటారా అని ప్రశ్నించారు. రైతులు, వాళ్ల జీవితాలను మార్చే ఉపయోగకరమైన బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమ చేసి, వారి ఉద్యమంతో చలి కాచుకునే కమ్యూనిస్టులకు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: