Home /News /politics /

BJP LEADER VISHNU VARDHAN REDDY KEY COMMENTS ON JAGAN AND AP MINSTERS NGS

tirupati by poll: సీఎం జగన్ సైకిల్ పై తిరుగుతున్నారా? మంత్రులు జగన్ ఇంటి పని మనుషులా? బీజీపీ నేత సంచలన విమర్శలు

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ సైకిల్ తొక్కుతున్నారా? ఏపీ మంత్రులు సీఎం జగన్ కు పని మనుషులుగా ఉన్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.

    ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉప ఎన్నికతో రాజకీయం వేడి పుట్టిస్తోంది. ఓ వైపు భానుడి భగభగలలో మాడు మండుతుంటే.. నేతల మధ్య మాటల తూటాలతో రాజకీయం పూర్తిగా హీటెక్కింది. ఆ మంట ఇప్పుడు రెట్టింపై తిరుపతిలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ మూడు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులూ వడ్డుతున్నాయి. జనసేన అధినేత పవన్ వచ్చి స్వయంగా బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ తరుపున ప్రచారం చేయడంతో కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ నేతలు టీడీపీ కంటే బీజేపీపైనే ఎక్కవ విమర్సలు చేయడంతో ప్రస్తుతం వార్ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారింది.

    వైసీపీ నేతలు బీజేపీ పై ఘాటుగా విమర్శలు చేస్తుంటే అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు బీజేపీ నేతలు. సీఎం జగన్, మంత్రుల తీరుపై బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ - జనసేన కవాతు చూసి వైసీపీ మంత్రులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఏపీ మంత్రులు పిరికిపందల్లా కనపడుతున్నారన్న ఆయన కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా అసలు పనికిరారని విమర్శించారు. మంత్రులు సీఎం జగన్ ఇంటి పని మనుషుల్లా పని చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్, సునీల్ దేవధర్ లను ఏకవచనంతో విమర్శించడం చాలా బాధేస్తోంది అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేంత దమ్ము ఏ మంత్రికైనా ఉందా అంటూ సవాల్ విసిరారు. పవన్ ప్రశ్నిస్తుంటే.. వాటికి సమాధానం చెప్పకుండా.. ఆయన ప్రత్యేక విమానం లో తిరుగుతున్నారని విమర్శించడం ఏంటని నిలదీశారు. సీఎం జగన్ ఏమైనా సైకిల్ మీద తిరుగుతున్నారా? అని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తో సీఎం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.

    ప్రధాని మోదీ, అమిత్ షా లకు ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధం ఉందని మాట్లాడడం దారుణమన్నారు. విమర్శించే వాళ్ళకు కళ్ళు కనపడని, చెవులు వినపడని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారన్నారు. తిరుపతిలో ఒక్క బీజేపీ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు 10 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు మకాం వేశారంటే అధికార పార్టీ ఎంతలా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఓటుకి 2వేల రూపాయలు పంచుతున్నారని, వాళ్ళ బినామీని తీసుకొచ్చి గ్లాస్ గుర్తు తెప్పించుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

    రామతీర్థం, అంతిర్వేది ఘటనల్లో హోం మంత్రి అసమర్ధతను వారే బయటపెట్టుకుంటున్నారి విమర్శించా రు. అని ప్రశ్నించిన ఆయన బీజేపీ ఆందోళనలు చేసిన తరువాత దేవాలయాల్లో సీసీ కెమెరాలు వచ్చాయని గుర్తు చేశారు. బీజేపీ నేతలు విగ్రహాలు కూల్చితే కేసులు పెట్టండని, లేదా హోం మంత్రితో రాజీనామా చేయమనండని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వానికి దమ్ముంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే నవతరం పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించేలా కుట్రలు చేశారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి దీని పై ఫిర్యాదు చేస్తామని అన్నారు. వైసీపీ మంత్రులు కొంతమంది ఇండిపెండెట్లు, చిన్న పార్టీలతో పోటీ చేయిస్తున్నారని, సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని గాజు గ్లాస్ గుర్తు సాధించారని ఆరోపించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Ap bjp, Ap cm ys jagan mohan reddy, Ap minister perni nani, Bjp, Bjp-janasena, Kodali Nani, Tirumala, Tirupati, Tirupati Loksabha by-poll, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు