• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • BJP LEADER VIJAYASHANTI FIRES ON TELANGANA CM K CHANDRASHEKAR RAO AND TRS AK

Vijayashanti: రాజకీయాల నుంచి రిటైరయిన కేసీఆర్.. కనీసం ఆ పని కూడా చేయలేదన్న విజయశాంతి

Vijayashanti: రాజకీయాల నుంచి రిటైరయిన కేసీఆర్.. కనీసం ఆ పని కూడా చేయలేదన్న విజయశాంతి

సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

Vijayashanti KCR: మహిళలను ముందుపెడితే తాము వెనక పడిపోతామని కొంతమంది పురుషులు అనుకుంటారని... మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

 • Share this:
  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ లేదా ప్రగతిభవన్‌లో కూర్చొని పాలిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా కేసీఆర్ బయటకు రావడం లేదని ఆరోపించారు. వ్యాక్సిన్ వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి.. కనీసం ఆ పని కూడా చేయలేదని విజయశాంతి మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విజయశాంతి పాల్గొన్నారు. సోషల్ మీడియాలో బీజేపీపై టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు.

  టీఆర్ఎస్‌ పార్టీలో గూండాలు ఉన్నారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతవరకు భూతులే మాట్లాడుతున్నారని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని విమర్శించారు. కబ్జాలతో తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. అభివృద్ధి తెలంగాణ కావాలంటే బీజేపీతోనే సాధ్యమని.. తెలంగాణ అభివృద్ధి కోసం మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని విజయశాంతి పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రూపురేఖలు మారుతాయని అన్నారు. మండలాలు, జిల్లాలు, గ్రామాలకు వెళ్లి ప్రజలకు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాలని కార్యకర్తలకు విజయశాంతి సూచించారు

  తెలంగాణ ప్రజలు అమాయకులని.. వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో మహిళలు పెద్ద పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. మహిళలను ముందుపెడితే తాము వెనక పడిపోతామని కొంతమంది పురుషులు అనుకుంటారని... మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మహిళలను ఎదుర్కునే శక్తి లేకనే సోషల్ మీడియాలో మహిళలను కించపర్చేలా పోస్ట్‌లు పెడుతున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు