• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • BJP LEADER VIJAYASHANTI COMMENTS ON TELANGANA CM KCR FOR HIS STATEMENTS IN HAALIYA MEETING AK

CM KCR-Vijayashanti: అవన్నీ నిజమైతే.. కేసీఆర్ ఓట్లు అడగకూడదు.. మండిపడ్డ విజయశాంతి

CM KCR-Vijayashanti: అవన్నీ నిజమైతే.. కేసీఆర్ ఓట్లు అడగకూడదు.. మండిపడ్డ విజయశాంతి

సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

CM KCR Vijayashanti: కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనంగా ఉంటుందో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

 • Share this:
  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి మండిపడ్డారు. వరుస ఓటములతో కేసీఆర్‌కు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని అన్నారు. తెలంగాణ ప్రజలను కుక్కలని... వేదన చెప్పుకోవడానికి వచ్చినవాళ్ళను ఈడ్చుకుపోవాలని కేసీఆర్ అనడాన్ని ఆమె తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ గూండాగిరికి తెగబడుతుంటే ఆ దొరహంకారానికి కర్రుకాల్చి ఓటు ద్వారా వాత పెట్టాల్సిన జిమ్మేదారీ ప్రజలు తీసుకోకతప్పదని అన్నారు. బాధిత మహిళలు కుక్కలా ? ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

  జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగమని... మాట తప్పితే మెడ నరుక్కుంటానని కేసీఆర్ అనడంపై విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆయన మాటలన్నీ నిజమైతే.. టీఆర్ఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదని అన్నారు. ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనంగా ఉంటుందో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని విజయశాంతి అన్నారు. హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగానికి స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోంది.  అంతకుముందు నల్లగొండ జిల్లా హాలియా సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సభలో ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో.. వారికి సభాముఖంగానే వార్నింగ్ ఇచ్చారు. వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ వాల్లు కొత్త బిచ్చగాళ్లలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కేసీఆర్ అన్నారు. బీజేపీ నాయకత్వం కూడా ఒల్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు