• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP LEADER VIJAYASHANTI COMMENTS ON KCR FOR HIS TOUR ON KALESWARAM PROJECT AK

Vijayashanti KCR: కేసీఆర్ పూజలపై విజయశాంతి అనుమానాలు.. అలా ఉన్నాయంటూ..

Vijayashanti KCR: కేసీఆర్ పూజలపై విజయశాంతి అనుమానాలు.. అలా ఉన్నాయంటూ..

సీఎం కేసీఆర్ దంపతుల పూజలు

Vijayashanti KCR: విజయశాంతి విమర్శలు ఎలా ఉన్నా.. మంత్రి కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని చేయబోతున్నారనే ఊహాగానాలకు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నాయకురాలు విజయశాంతి.. మరోసారి ఆయన వ్యవహారశైలిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఒకవైపు కేటీఆర్‌ను తెలంగాణకు కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్నారని కామెంట్ చేశారు. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి... గోదావరికి హారతులిచ్చి పూజాధికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను రేకెత్తించిందని వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి పర్యటనలో కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్‌లను కేసీఆర్ ఆకాశానికెత్తేయడాన్ని విజయశాంతి విమర్శించారు.

    ఇంతకాలం కమీషన్ల రూపంలోనో... మరో రూపంలోనో తనను కనికరించిన ఆ ప్రాజెక్టుల వద్ద ఆయన పర్యటనలు, ఆలయాల్లో పూజలు చూస్తేకొడుక్కి పీఠం అప్పగించి తాను నిష్క్రమించే ముందు ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నందుకు పాప పరిహారంగా నదీమ తల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆయన తీరు కనిపిస్తోందని విజయశాంతి విమర్శించారు. ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులు ఉపాధి కోసం విజ్ఞప్తి చేసుకోవడానికి వస్తే కలుసుకునే సమయమే లేకుండా పోయిందని.. దీన్ని బట్టి రైతాంగం, ప్రజల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్‌కు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

    ghmc, ghmc elections, ghhmc elections 2020, ghmc elections day, hyderabad ghmc elections, vijayashanthi, hyderabad విజయశాంతి, జీహెచ్ఎంసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు, సీపీ సజ్జనార్, హైదరాబాద్
    విజయశాంతి (ఫైల్)


    విజయశాంతి విమర్శలు ఎలా ఉన్నా.. మంత్రి కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని చేయబోతున్నారనే ఊహాగానాలకు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. ఓ వైపు మంత్రులు, మరోవైపు ఎమ్మెల్యేలు సైతం మంత్రి కేటీఆర్ సీఎం కావాలని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ముహూర్తం దగ్గర పడిందనే ప్రచారం జోరందుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు