BJP LEADER VIJAYASHANTHI SERIOUS COMMENTS ON CM KCR NS
Vijayashanthi: కేసీఆర్ నన్ను బూతులు తిట్టించాడు.. ఆ రోజు నేను లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Vijayashanthi on kcr : తన ప్రయోజనాల కోసమే లాక్డ్న్ ఎత్తివేసిన సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, సినీ సినీనటి విజయశాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో తాను ఓయూకు వెళ్తే పథకం ప్రకారం ఐదు వేల మంది విద్యార్థులతో తానను అనరాని మాటలు అనిపించాడని, బూతులు తిట్టించాడని ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఓ పెద్ద క్రిమినల్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. తాను టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నానని కేసీఆర్ ప్రచారం చేయించాడని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాను ఓయూకు వెళ్తే పథకం ప్రకారం ఐదు వేల మంది విద్యార్థులతో తానను అనరాని మాటలు అనిపించాడని, బూతులు తిట్టించాడని ఆరోపించారు. తెలంగాణ బిల్ పాస్ అయ్యే సమయంలో కేసీఆర్ సభలో లేకుండా మోసం చేశారని విమర్శించారు. ఆ రోజు తాను సభలో లేకపోతే తెలంగాణ బిల్ పాస్ అయ్యేది కాదన్నారు. కేసీఆర్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని తన కుటుంబానికి తరతరాలైనా పదవులు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడని మండిపడ్డారు. తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాల మీద కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నాడన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ ను ప్రజలు పడుకోబెడుతాన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ సరైన పార్టీ అని అన్నారు. ఎన్ని సార్లు మాయమాటలు చెప్పి మోసం చేస్తావని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒకానొక సమయంలో కేసీఆర్ దగ్గర డబ్బులు లేక.. రూ. లక్ష కోసం ఊరంతా తిరిగాడన్నారు. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు లక్షల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అనేక సమావేశాల్లో ప్రజలు కోరినా తనను మాట్లాడనివ్వకుండా అవమానించాడని కేసీఆర్ పై విజయశాంతి నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదవిని, డబ్బులను తప్పా తెలంగాణ ప్రజలను ఏనాడూ ప్రేమించలేదన్నారు.
కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టానని విజయశాంతి అన్నారు. తన తర్వాతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడన్నారు. ప్రద్యేక రాష్ట్రం కోసమే తాను తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశానని విజయశాంతి అన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే కుట్రతో కేసీఆర్ తనను అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారని విజయశాంతి ఆరోపించారు. తాను కేసీఆర్ అనుమతితోనే ఇచ్చంపల్లి సమస్యపై నాడు వైఎస్ఆర్ను కలిశానన్నారు. అయితే కేసీఆర్ తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.