HOME »NEWS »POLITICS »bjp leader vijayashanthi sensational comments on cm kcr govt sk

CM KCR-Vijayashanthi: సీఎం కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

CM KCR-Vijayashanthi: సీఎం కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

Vijayashanthi: ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపైనా విజయశాంతి స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రధాని మోదీ కలని.. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఆమె అన్నారు.

 • Share this:
  బీజేపీ(BJP)లో చేరిన తర్వాత రాములమ్మ దూకుడు పెంచారు. తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్‌పై విజయశాంతి (Vijayashanthi) విరుచుకుపడ్డారు. మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆమె విమర్శించారు. సీఎం హోదాలో ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకుని.. ప్రజలకు బకరాలను చేసేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. త్వరలోనే సీఎం కేసీఆర్ అవినీతి ఆరోపణలు రుజువవుతాయని.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారన్న విజయశాంతి... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు.

  ఇక ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపైనా విజయశాంతి స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రధాని మోదీ కలని.. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఆమె అన్నారు. అన్నదాతల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  కాగా, దుబ్బాక ఉపఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 48 సీట్లు సాధించడంతో.. ఆ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయశాంతి కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. డిసెంబరు 6న ఢిల్లీకి వెళ్లిన విజయశాంతి అక్కడ కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ మరుసటి రోజుబీ జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్‌లో ఉన్న ఆమె.. బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆరే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:December 13, 2020, 21:31 IST

  टॉप स्टोरीज