వైసీపీతో పొత్తు... క్లారిటీ ఇచ్చిన బీజేపీ

రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానిని కలుస్తారని... దానికి వేరే వేరే అర్ధాలు తీసుకోవద్దని బీజేపీ నేత సునీల్ దియోదర్ అన్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 2:08 PM IST
వైసీపీతో పొత్తు... క్లారిటీ ఇచ్చిన బీజేపీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
  • Share this:
బీజేపీ రాజధాని అమరావతికే మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోదర్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజదాని విషయంలో టీడీపీ, వైసీపీ మైండ్ గేమ్ ఆడుతున్నాయని అన్నారు. కౌన్సిల్ రద్దు అనేది ఏకపక్ష నిర్ణయమని.. ప్రభుత్వం ఒంటి ఎద్దు పోకడిగా వెళ్తుందని ఆరోపించారు. ఒక్క రాష్ట్రం ఒక్క రాజధానే బీజేపీ నినాదమని అన్నారు. ఏపీ సీఎం జగన్, ప్రధాని మోదీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సునీల్ దియోదర్... ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. తాము రాష్ట్రంలో జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని తెలిపారు.

స్థానిక ఎన్నికలో కూడా జనసేనతో కలిసి పని చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అన్నారు. రాష్ట్ర సీఎంలు, ప్రధాని కలుస్తారని... దానికి వేరే వేరే అర్ధాలు తీసుకోవద్దని సునీల్ దియోదర్ అన్నారు. ప్రస్తుత సీఎం జగన్ చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్ఆర్‌సి , సీఏఏ లకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చి ఇప్పుడు బయట ఏ విధంగా వ్యతిరేకంగా ర్యాలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు