సీఎం జగన్ బెయిల్‌పై బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలు...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఏడాది పాలనపై బీజేపీ జనరల్ సెక్రటరీ రాంమాధవ్ తీవ్రంగా మండిపడ్డారు.

news18-telugu
Updated: June 10, 2020, 7:30 PM IST
సీఎం జగన్ బెయిల్‌పై బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలు...
బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఏడాది పాలనపై బీజేపీ జనరల్ సెక్రటరీ రాంమాధవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతా రివర్స్‌లో పాలన జరుగుతోందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఓ వైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్ మంత్రం. అన్నీ రివర్సే. రాజధానితో మొదలైంది రివర్స్. పోలవరం ప్రాజెక్టుకు టెండర్లు రివర్స్, అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామన్నారు. దాంట్లో రివర్స్. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లతో మద్యం ప్రవహిస్తోంది. తిరుమల ఆలయ భూములు, ఆస్తులు అమ్మేసే ప్రయత్నం చేశారు. ప్రజలు రివర్స్ కావడంతో అక్కడా రివర్స్ అయ్యారు. ఎలక్షన్ కమిషనర్‌లో రివర్స్. బహుశా 60 సార్లు (సగటున వారానికి ఓసారి) హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం దేశంలో ఇంకెక్కడా లేదు. బెయిల్ మీద ఒకాయన ఉంటే, బెయిల్ కోసం తయారీలో ఇంకొకాయన ఉన్నారు.’ అని రాంమాధవ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందించడానికి మోదీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. పన్ను నిష్పత్తి కింద ఏపీ నుంచి 41 శాతం వాటా కింద దాదాపు రూ.35,000 కోట్ల ఆదాయం రావాల్సి ఉందని రాంమాధవ్ అన్నారు. గత ఏడాదిగా వైసీపీ పుణ్యమా అని రెవిన్యూ పెరగకపోగా ఆదాయం తగ్గిపోయిందన్నారు. పుండు మీద కారం లాగా కోవిడ్ 19 సమస్య వచ్చిందన్నారు. దీని వల్ల రాష్ట్రం, కేంద్రం ఆదాయం తగ్గిందన్నారు. అయినా కూడా రాష్ట్రం నుంచి అంచనా ప్రకారం ట్యాక్స్ రెవిన్యూ రాకపోయినా కూడా కేంద్రం నుంచి ఇస్తామని వాగ్దానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ట్యాక్సులు వసూలు కాకపోయినా రెండు విడుతల్లో రూ.10,000 కోట్లు ఏపీకి కేంద్రం ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల కోసం రూ.3,900 కోట్లు ఇచ్చామన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ రిలీఫ్ కింద రూ.1,100 కోట్ల పై చిలుకు డబ్బులు చెల్లించామన్నారు. ఈ ఏడాది మొత్తం రూ.45,000 కోట్లు కేంద్రం నుంచి ఏపీకి లభిస్తోందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 10, 2020, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading