హోమ్ /వార్తలు /రాజకీయం /

అనారోగ్యం సాకుతో బెయిల్ పొంది...ఎన్నికల్లో పోటీ ఎలా సాధ్యం...సాధ్వి ప్రగ్యాపై కోర్టులో పిటిషన్

అనారోగ్యం సాకుతో బెయిల్ పొంది...ఎన్నికల్లో పోటీ ఎలా సాధ్యం...సాధ్వి ప్రగ్యాపై కోర్టులో పిటిషన్

ప్రగ్యా సింగ్ ఠాకూర్ ( ఫైల్ చిత్రం)

ప్రగ్యా సింగ్ ఠాకూర్ ( ఫైల్ చిత్రం)

కోర్టులను తప్పుదోవ పట్టించి అనారోగ్యం సాకుతో బెయిల్ పొంది... సాధ్వి ప్రగ్యా సింగ్ ఇప్పుడు ఎన్నికల బరిలో ఎలా దిగుతున్నారని మాలేగావ్ పేలుళ్లలో కొడుకును కోల్పోయిన ఒక తండ్రి ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించాడు...కోర్టు విచారణకు సైతం అడ్డంకిగా మారిన అనారోగ్యం.. మండుటెండల్లో ఎన్నికల ప్రచారానికి అడ్డంకిగా మారడం లేదా అని పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఇంకా చదవండి ...

  మాలేగావ్ పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితురాలిగా విచారణ ఎదుర్కొంటున్న బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని పేలుళ్ల బాధితుడు ఒకరు ఎన్ఐఏ కోర్టు ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన ప్రగ్యా సింగ్ ఠాకూర్ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. అయితే 2008 సంవత్సరంలో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల ఘటనలో తన కుమారుడిని కోల్పోయిన బాధితుడు నిసార్ సయీద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. బాంబుపేలుళ్ల కేసులో నిందితురాలిగా 9 సంవత్సరాలు కోర్టులో గడిపిన ప్రగ్యాసింగ్ ఠాకూర్ 2017లో అనారోగ్యం కారణంగా బెయిల్‌పై విడుదలయ్యారు.


  ప్రగ్యా సింగ్ అభ్యర్థిత్వాన్ని సవాలు చేసిన పిటిషనర్, ఆవిడ కోర్టు ప్రిసీడింగ్స్‌కు అనారోగ్యం సాకుగా చూపించి రావడం లేదని, అలాగే తనకు క్యాన్సర్ సోకిందని కూడా నిందితురాలు పేర్కొంది. అయితే అనారోగ్యంతో కోర్టుకు రాలేని నిందితురాలు మండుటెండల్లో ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటుందని పిటిషన్ లో పేర్కొన్నాడు. తద్వారా కోర్టులను తప్పుదోవ పట్టించినట్లు తెలిపాడు. అంతేకాదు నిందితురాలు ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, ఈ మేరకు ఎన్ఐఏ కోర్టు కల్పించుకొని ఆర్డర్ పాస్ చేయాలని కోరాడు.


  ఇదిలా ఉంటే స్పెషల్ జడ్జ్ వీఎస్ పడల్‌కర్ ఏప్రిల్ 22న ఎన్ఐఏ, అలాగే ఠాకూర్ తరపున వివరణలు కోరనున్నారు. కాగా 2008, సెప్టెంబర్ 29న మాలేగావ్ లో జరిగిన బాంబుపేలుళ్లలో మొత్తం 6 మంది చనిపోగా, వంద మంది తీవ్రగాయాల పాలయ్యారు.

  First published:

  Tags: Bhopal S12p19, Bjp, Digvijaya Singh, Lok Sabha Election 2019, Madhya pradesh, Madhya Pradesh Lok Sabha Elections 2019, Terrorism

  ఉత్తమ కథలు