Home /News /politics /

BJP LEADER MURALIDHAR RAO SLAMS TELANGANA CM KCR MKS

KCR శాశ్వతంగా ఆస్పత్రిలోనే!.. అందుకే గుండె ఆగినంత పనైంది!!: బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

యశోదాలో కేసీఆర్ కు  వైద్య పరీక్షలు (శుక్రవారం నాటి దృశ్యం)

యశోదాలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు (శుక్రవారం నాటి దృశ్యం)

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్‌కు గుండె ఆగినంత పని అయిందని, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ శాశ్వతంగా ఆస్పత్రిలోనే గడపాల్సి వస్తుందని మురళీధర్ రావు అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటుచేస్తానంటూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారీ షాకిచ్చాయని కమలనాథులు ఎద్దేవా చేస్తున్నారు. యూపీ బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయని, తెలంగాణలోనూ యూపీ మాదిరి ఫలితాలు వస్తాయని కొందరు నేతలు వ్యాఖ్యనించగా, కేసీఆర్ సామాజికవర్గానికే చెందిన కీలక నేత, మధ్యప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జి మురళీధర్‌రావు మరో అడుగు ముందుకేసి షాకింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మల్‌ జిల్లాలోని సోన్‌లో శనివారం జరిగిన డిజిటల్‌ హిందూ సమ్మేళనానికి మురళీధర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్‌కు గుండె ఆగినంత పని అయిందని మురళీధర్‌రావు అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రానుందని, కేసీఆర్‌ శాశ్వతంగా ఆస్పత్రిలోనే గడపాల్సిన పరిస్థితులు రానున్నాయని వ్యాఖ్యానించారు.

KCRకు షాకిచ్చిన దేవేగౌడ! -బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి కష్టమే -2సార్లు విఫలమయ్యానన్న మాజీ ప్రధాని


రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్‌ పిచ్చి కూతలు కూస్తున్నారని మురళీధర్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల దేవాలయ భూములను టీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ ను ప్రజలే ఓడిస్తారని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మురళీధర్ రావు జోస్యం చెప్పారు.

Venu Prasad: తెలుగు అధికారికే తొలి పోస్ట్: పంజాబ్ కొత్త సీఎం అదనపు సీఎస్‌గా వేణు ప్రసాద్


జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి నేతృత్వం వహిస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరపడం తెలిసిందే. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరి, సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు. సీఎం ప్రతి ఏటా ఫిబ్రవరిలో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని, అప్పటికి ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉండటంతో మరికొన్ని పరీక్షలు చేశామని, రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎంకు సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేశామని వైద్యులు వెల్లడించడం విదితమే. కేసీఆర్ ఆరోగ్యంపై బీజేపీ నేతలు కామెంట్లు చేయడంపై టీఆర్ఎస్ వర్గాలు మండిపడ్డాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, CM KCR, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు