BJP LEADER MLA FIRED ON CM KCR THAT TELANGANA GOVERNMENT NOT HEARING POLITICAL PARTIES AND EMPLOYEES VOICES OVER EMPLOYEES TRANSFERS AND 317 GO ISSUE PRV
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP leader and MLA Eatala Rajendhar) తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government)పై మండిపడ్డారు. ఎవరి మాట వినకుండా సీఎం కేసీఆర్ ఉద్యోగుల బదిలీల విషయంలో వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. బదిలీ (Transfers)ల పేరిట జీవోలు తెచ్చి ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు ఈటల. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల (Government Employees) పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఈటల మండిపడ్డారు . ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల దుయ్యబట్టారు. ఉద్యోగులతో చర్చించకుండా కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రాజేందర్ (rajendhar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
ఉద్యోగులు స్థానికత విషయంలో ఇబ్బంది పడుతున్నారని ఆయా రాజకీయ పార్టీల (Political pary) నాయకులు చెప్పినా వినకుండా కేసీఆర్ (KCR) మొండి వైఖరి అవలంభిస్తున్నారని రాజేందర్ మండిపడ్డారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని (TRS Government) రాజేందర్ ఆరోపించారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఎక్కడ లేదన్నారు ఈటల.
ఉద్యోగుల సంఘాల (Employee unions)తో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలి రాజేందర్ డిమాండ్ చేశారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉప్పుల కుటుంబానికి ఆర్దిక సహాయంగా ఈటల రాజేందర్ రూ. 50 వేలు అందించారు . ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.