Home /News /politics /

BJP LEADER KRISHNASAGAR RAO COMMENTS ON STATE ELECTION COMMISSION OVER GHMC ELECTIONS NS

GHMC Elections: కేసీఆర్ చేతిలో తోలుబొమ్మలా ఎలక్షన్ కమిషన్.. బీజేపీ ధ్వజం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మలా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోన్న పద్ధతిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మలా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోన్న పద్ధతిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పోలింగ్ తేదీలను ఇవ్వడం ఈ రాష్ట్రంలో ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ అని అన్నారు. ఇది బయటి వారి ప్రమేయం లేకుండా పనిచేయాలన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ చెప్పినట్టు ఆడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల సంఘం ప్రవర్తన ఉందని ఆయన ధ్వజమెత్తారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.  రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.  21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు.

    డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు.  ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్ఈసీ ప్రకటనతో జీహెచ్ఎంసి పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020, Telangana bjp

    తదుపరి వార్తలు