బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం.. తల్లి ఆండాలమ్మ కన్నుమూత..

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కిషన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో గురువారం ఆండాలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.

news18-telugu
Updated: April 25, 2019, 7:18 AM IST
బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం.. తల్లి ఆండాలమ్మ కన్నుమూత..
కిషన్ రెడ్డి తల్లి ఆండాలమ్మ (File)
news18-telugu
Updated: April 25, 2019, 7:18 AM IST
బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కిషన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో గురువారం ఆండాలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

ఇదిలా ఉంటే, గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గతంలో వరుసగా మూడుసార్లు అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిషన్ రెడ్డి.. అక్కడ ఓడిపోవడం పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమికి లోక్‌సభ ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. స్థానిక ప్రజలు తననే గెలిపిస్తారన్న ధీమాతో ఉన్నారు.

First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...