కవిత ఎలా ఓడింది ?.. కేటీఆర్‌కు కిషన్ రెడ్డి కౌంటర్

బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: August 21, 2019, 1:44 PM IST
కవిత ఎలా ఓడింది ?.. కేటీఆర్‌కు కిషన్ రెడ్డి కౌంటర్
కేటీఆర్, కిషన్ రెడ్డి
  • Share this:
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో బీజేపీ లేకపోతే... ఆయన చెల్లెలు కవిత ఎలా ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. ఏడు లోక్ సభ సీట్లలో ఓటమి తరువాత టీఆర్ఎస్ నేతలకు మతిభ్రమించిందని ఆయన వ్యాఖ్యానించారు. జేడీ నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన మంత్రిగా ఉన్న తెలంగాణ ఎంపీలతో పాటు కేటీఆర్ కూడా ఆయనను కలిశారని గుర్తు చేశారు.

తాము కేటీఆర్‌లా అహంకారపూరిత వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. జేపీ నడ్డా చేసిన విమర్శలపై కేటీఆర్ స్పందిస్తే బాగుండేదని కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్న కిషన్ రెడ్డి... తమ టార్గెట్ 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే అని స్పష్టం చేశఆరు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారని వస్తున్న ఊహాగానాలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు.


First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు