నిమ్మగడ్డకు కంగ్రాట్స్ చెప్పా... అందుకే అక్కడికి వెళ్లా... కామినేని వివరణ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, కామినేని శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

తాను రమేశ్ కుమార్‌తో జరిగిన ఎలాంటి సమావేశంలోనూ పాల్గొనలేదని కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

  • Share this:
    తాను కేవలం సుజనా చౌదరిని కలిసేందుకే పార్క్ హయత్ హోటల్‌కు వెళ్లానని బీజేపీ నేత, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తాను వెళ్లే సమయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అక్కడకు వచ్చారని... కోర్టులో ఆయనకు తీర్పు అనుకూలంగా వచ్చినందుకు ఆయనకు కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వచ్చేశానని కామినేని వివరణ ఇచ్చారు. అంతే తప్ప తాను రమేశ్ కుమార్‌తో జరిగిన ఎలాంటి సమావేశంలోనూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అయినా అది రహస్య సమావేశం కాదని... స్టార్ హోటల్‌లో సీసీ కెమెరాలు ఉంటాయని అన్నారు. దీనిపై వైసీపీ నేతలు రాజకీయ చేయడం తగదని హితవు పలికారు. అయినా తానేమీ కలవకూడని వ్యక్తులతో కలవలేదని అన్నారు. దీనిపై ఇంత రాద్ధాంతం అవసరం లేదని చెప్పారు. తనను దొంగ అని వైసీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పుబట్టారు.

    మరోవైపు అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం రమేశ్ కుమార్ విషయంతో ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని కామినేని శ్రీనివాస్ అన్నారు. అసలు రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నారో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రమేశ్ కుమార్ ఎస్ఈసీ కాకపోతే... ఆయనను కలవడంతో వారికి అభ్యంతరం ఏంటని కామినేని ప్రశ్నించారు. తాను రమేశ్ కుమార్ కోసం కోర్టులో పిటిషన్ వేయలేదని... ఆయనను తొలగించిన ప్రక్రియ సరికాదనే కారణంగానే కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
    First published: