ఏపీలో టెన్షన్ వాతావరణం.. గవర్నర్‌కు జీవీఎల్‌ ఫిర్యాదు

అధికార, ప్రతిపక్షాల తీరుతో రాజకీయ ఘర్షణలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. రాజకీయాలు స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని.. అంతేతప్ప ఒకరినొకరు అడ్డుకునే పరిస్థితి ఉండకూడదన్నారు జీవీఎల్.

news18-telugu
Updated: February 29, 2020, 1:22 PM IST
ఏపీలో టెన్షన్ వాతావరణం.. గవర్నర్‌కు జీవీఎల్‌ ఫిర్యాదు
జీవీఎల్ నరసింహారావు (ఫైల్)
  • Share this:
విశాఖ ఘటనపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు శనివారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. వైసీపీ, టీడీపీ వైరంతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొందని ఫిర్యాదు చేశారు. ఏపీలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని గవర్నర్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. అధికార, ప్రతిపక్షాల తీరుతో రాజకీయ ఘర్షణలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. రాజకీయాలు స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని.. అంతేతప్ప ఒకరినొకరు అడ్డుకునే పరిస్థితి ఉండకూడదన్నారు జీవీఎల్.

గురువారం విశాఖపట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. విశాఖలోని పెందుర్తిలో పెందుర్తి భూసమీకరణ బాధితులను కలవాలని చంద్రబాబు భావించారు. ఐతే వైసీపీ శ్రేణులు చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐనా వైసీపీ కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో చంద్రబాబే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఐతే చంద్రబాబు కాన్వాయ్‌పై గుడ్లు, టామోటాలు విసిరి.. వైసీపీ నేతులు గూండాయిజం ప్రదర్శించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: February 29, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading