Home /News /politics /

BJP LEADER FILES POLICE COMPLAINT AGAINST MAMATA BANERJEE FOR INSULTING NATIONAL ANTHEM IN MUMBAI SK

Mamata Banerjee: జాతీయ గీతాన్ని అవమానిస్తారా? మమతా బెనర్జీపై కేసుపెట్టిన బీజేపీ నేత

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

Mamata Banerjee: బీజేపీ కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద గుప్త.. మమతా బెనర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ గీతం పాడేటప్పుడు లేచి నిలబడాలని, కానీ ఆమె ఉద్దేశ్వపూర్వకంగానే కూర్చొని ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) తీరుపై దుమారం రేగుతోంది. ఆమె జాతీయ గీతాన్ని అవమానపరిచారని బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.  అంతేకాదు ముంబై బీజేపీకి చెందిన ఓ నేత ఆమెపై పోలీస్ కేసు పెట్టారు. బుధవారం ముంబైలో పర్యటించిన మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్సేతర థర్డ్ ఫ్రంట్ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శరద్‌ పవార్‌తో చర్చలు జరిపారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా జాతీయ గీతాన్ని (National Anthem) ఆలపించారు మమతా బెనర్జీ. ఐతే కుర్చీపై కూర్చునే జాతీయ గీతాలాపనను ప్రారంభించారు. ఆ తర్వాత వెంటనే  తేరుకొని నిలబడి పాడారు. కానీ జాతీయ గీతాన్ని పూర్తి చేయలేదు. మధ్యలోనే ఆపివేశారు. జై మహారాష్ట్ర.. జై బెంగాల్.. జై భారత్ అంటూ ముగించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Fishermen missing: అల్లకల్లోలంగా సముద్రం.. 15 పడవలు బోల్తా.. మత్స్యకారులు గల్లంతు



    ‘‘ జాతీయ గీలాపన సమయంలో మమతా బెనర్జీ మొదట కూర్చుతున్నారు. ఆ తర్వాత లేచి నిలబడి భారత జాతీయ గీతాన్ని సగంలో పాడటం మానేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా మమతా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది.

    What an Idea: ఐడియా అంటే ఇది.. కుక్కర్ ప్రెజర్‌తో క్షణాల్లోనే వేడి వేడి కాఫీ.. టేస్టీ కూడా



    జాతీయ గీతాన్ని మమతా బెనర్జీ అవమానపరిచారని అంటూ బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రవర్తన సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు.





    మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం పదవిలో ఉండి జాతీయ గీతాన్ని అవమాన పరుస్తారా? అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద గుప్త.. మమతా బెనర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ గీతం పాడేటప్పుడు లేచి నిలబడాలని, కానీ ఆమె ఉద్దేశ్వపూర్వకంగానే కూర్చొని ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని బెంగాల్‌కు చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారని, కానీ అదే బెంగాల్‌కు సీఎంగా ఉన్న మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానపరచడం సిగ్గుచేటని విమర్శించారు. నేషనల్ హానర్ యాక్ట్, 1971 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Assembly Election 2022, Maharastra, Mamata Banerjee, Mumbai, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు