Etela Rajendar: హుజూరాబాద్‌లో గెలుపు కోసం ఈటల రాజేందర్ నయా ప్లాన్ అదేనా.?

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

హుజూరాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా మార్చాలని ఈటల రాజేందర్ భావించారు. కానీ టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికను బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసింది.

  • Share this:
    హుజూరాబాద్‌లో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంటే.. దశాబ్దానికి పైగా నియోజకవర్గానికి తాను చేసిన సేవను గుర్తు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్. తనను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అవమానాలకు గురి చేసిందో చెప్పడంతో పాటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా ఉందో చెబుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి మరికొన్ని వారాలు మాత్రమే గడువు ఉండటంతో.. మాజీమంత్రి ఈటల రాజేందర్ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

    నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా మార్చాలని ఈటల రాజేందర్ భావించారు. కానీ టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికను బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసింది. ఒకవేళ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తే.. అప్పుడు టీఆర్ఎస్ నేతలు జాతీయస్థాయిలో బీజేపీ విధానాలను ప్రశ్నిస్తారని ఈటల రాజేందర్ వర్గం భావిస్తోంది.

    ఈటల రాజేందర్‌ కూడా ఇదే రకమైన ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులు కాకుండా రాష్ట్రస్థాయిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మరికొందరు ముఖ్యనేతలు మాత్రమే పాల్గొంటే బాగుంటుందని ఈటల రాజేందర్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన బీజేపీ వ్యూహకర్తలకు వివరించారని టాక్.

    Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

    Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

    హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో జాతీయ స్థాయి అంశాల జోలికి వెళ్లకుండా కేవలం ఈటల రాజేందర్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించడంతో పాటు రాష్ట్రంలోని కేసీఆర్ పాలనను టార్గెట్ చేయాలని బీజేపీ వ్యూహాన్ని ఖరారు చేసుకుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్ నుంచి ఎన్నో ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్న ఈటల రాజేందర్.. తొలిసారి టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతారన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: