జగన్‌తో దోస్తీకి కారణమదే...కేసీఆర్‌పై డీకే అరుణ విమర్శలు

పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తానే తీసుకొచ్చానన్నారు డీకే అరుణ. ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చునే అర్హత కేసీఆర్‌కు లేదని విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: August 30, 2019, 9:12 PM IST
జగన్‌తో దోస్తీకి కారణమదే...కేసీఆర్‌పై డీకే అరుణ విమర్శలు
డీకే అరుణ, కేసీఆర్
news18-telugu
Updated: August 30, 2019, 9:12 PM IST
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఎన్నడూ లేని విధంగా రాయలసీమపై కేసీఆర్‌కు కొత్త ప్రేమ పుట్టుకొచ్చిందని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారన్న డీకే అరుణ..పాలమూరు జిల్లాకు ఆయన చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను విమర్శించారు.

ఎన్నికల వేళ ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం ఇచ్చాకే ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారు. పాలమూరుకు కేసీఆర్‌ చేసిందేమీ లేదు ఏడాదిలోగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. గతంలో ఏపీ సీఎంకు హారతి పట్టానని కేసీఆర్‌ నన్ను తిట్టారు. మరి ఇప్పుడు ఆయన చేస్తుందేమిటి?
డీకే అరుణ
నేనే పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తానే తీసుకొచ్చానన్నారు డీకే అరుణ. ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చునే అర్హత కేసీఆర్‌కు లేదని విమర్శలు గుప్పించారు.
First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...