కమీషన్ల కోసమే ప్రాజెక్టులు... టీఆర్ఎస్‌పై మండిపడ్డ డీకే అరుణ

డీకే అరుణ, కేసీఆర్

ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప‌ని చేయడం డీకే అరుణ ఆరోపించారు.

  • Share this:
    తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలను మాజీమంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలన జరగడం లేదని విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో తెలంగాణను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో ల‌క్ష కోట్లు మాయం చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎక‌రాల‌కు నీరందించారనే విషయాన్ని ప్రభుత్వం లెక్క చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అభివృద్ది పేరుతో కమీషన్ల కోసం మూడు లక్షల కోంట్ల అప్పు భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు.

    ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప‌ని చేయడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల క‌మీష‌న్ల కోస‌మే ప‌రిత‌పిస్తుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను తాము ఎత్తి చూపిస్తామని... ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళతామని ఆమె స్పష్టం చేశారు. మాట‌ల గార‌డితో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకతప్పదని డీకే అరుణ హెచ్చరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: