BJP LEADER DK ARUNA DEMAND LIQUOR BAN IN TELANGANA SK
తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలి.. నిరాహార దీక్షకు బీజేపీ నేత సిద్ధం
విదేశీ మద్యం 50 - 60 ఎంఎల్ మీద రూ.30
ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. ఈ మహిళా సంకల్ప దీక్షకు పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. దిశా హత్యాచారం ఘటనపై దేశమంతా భగ్గుమంటున్నా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని నిప్పులు చెరిగారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో మద్యం, డ్రగ్స్‌పై నిషేధం విధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్యం మత్తులోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని... రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. మద్యం నిషేధించాలంటూ ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. ఈ మహిళా సంకల్ప దీక్షకు పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
డీకే అరుణ (ఫైల్)
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.