కేసీఆర్ అందులో కొట్టుకుపోతారు... బీజేపీ నేత డీకే అరుణ

ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదని... సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదం కేసీఆర్‌కే వర్తిస్తుంది కానీ కార్మికులకు వర్తించదని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు.

news18-telugu
Updated: October 21, 2019, 5:01 PM IST
కేసీఆర్ అందులో కొట్టుకుపోతారు... బీజేపీ నేత డీకే అరుణ
డీకే అరుణ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 21, 2019, 5:01 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు, మాజీమంత్రి డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతిలో కూరుకుపోయిన సీఎం కేసీఆర్ జైలుకు పోయే రోజులు దగ్గరలోనే ఉందని ఆమె ఆరోపించారు. సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు డీకే అరుణ మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మెగా మారుతున్న ఆర్టీసీ సమ్మెలో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని అన్నారు.

సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ అంటూ బెదిరిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదని... సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదం కేసీఆర్‌కే వర్తిస్తుంది కానీ కార్మికులకు వర్తించదని అన్నారు. లక్షల కోట్లు అప్పులు తెస్తున్న సీఎం కేసీఆర్... ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేకపోయారని విమర్శించారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం టీఆర్ఎస్ నేతల చేతుల్లో పెడుతోందని డీకే అరుణ ఆరోపించారు.


First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...