• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • BJP LEADER DK ARUNA COMMENTS ON KRISHNA RIVER WATER DISPUTE AN CM KCR AK

కేసీఆర్‌కు అన్నీ తెలుసు... ఏపీ సర్కార్ జీవోపై డీకే అరుణ వ్యాఖ్యలు

డీకే అరుణ, కేసీఆర్

కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.

  • Share this:
    సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతోందని అనుకోవడంలేదని బీజేపీ నేత, మాజీమంత్రి డీకే అరుణ ఆరోపించారు. తన స్వార్థం కోసం కేసీఆర్ స్వరాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ కేసీఆర్‌కు దక్షిణ తెలంగాణపై లేదని ఆమె మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని డీకే అరుణ విమర్శించారు.

    కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే జగన్ జీవో 203 తీసుకొచ్చారని ఆరోపించారు. ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పాలమూరు ప్రజలకు చేసిందేమీలేదని ఆమె మండిపడ్డారు. ప్రతిసారీ సెంటిమెంట్ వర్కౌట్ కాదని గుర్తు చేశారు.. పోతిరెడ్డిపాడు వలన ఎక్కువ నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానేనని, దక్షిణ తెలంగాణ రైతుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని డీకే అరుణ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: