అజంఖాన్ తల నరికి పార్లమెంట్ గుమ్మానికి వేలాడదీయండి : భగ్గుమన్న బీజేపీ

అజంఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అఫ్తాబ్ అన్నారు.ఇలాంటి వ్యక్తుల వల్లే మహిళలను కించపరుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.

news18-telugu
Updated: July 26, 2019, 9:25 AM IST
అజంఖాన్ తల నరికి పార్లమెంట్ గుమ్మానికి వేలాడదీయండి : భగ్గుమన్న బీజేపీ
ఆజం ఖాన్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 26, 2019, 9:25 AM IST
ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజంఖాన్ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై కన్నెర్ర చేసిన బీజేపీ నాయకుడు అఫ్తాబ్ అద్వానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అజంఖాన్ తల నరికి పార్లమెంట్ గుమ్మానికి వేలాడదీయాలన్నారు. అజంఖాన్ వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఆయన తల నరికి పార్లమెంట్ గుమ్మానికి వేలాడదీయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అప్పుడు గానీ అజంఖాన్ లేదా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారికి  మహిళలను కించపరిస్తే ఏమవుతుందో తెలిసి వస్తుందన్నారు.

మహిళలను కించపరచడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దు. ఇంతకుముందు జయప్రదపై అజంఖాన్ ఇలాగే నోరుపారేసుకున్నాడు. ఇప్పుడు రమాదేవిపై. దీన్ని తీవ్రంగా ఖండించాలి.ఈ ముసలాయనకు పిచ్చెక్కినట్టుంది. అందుకే అలాంటి కామెంట్స్ చేశాడు. కాబట్టి అతన్ని పిచ్చి కుక్కను చంపినట్టు చంపాలి. ఇలాంటి వ్యక్తులు దేశానికే ప్రమాదకరం.
అప్తాబ్ అద్వానీ,బీజేపీ


అజంఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అఫ్తాబ్ అన్నారు.ఇలాంటి వ్యక్తుల వల్లే మహిళలను కించపరుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.కాగా, గురువారం లోక్‌సభలో అజంఖాన్ మాట్లాడుతున్న సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. దీంతో ఆమెపై అజంఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'నేను తదేకంగా మీవైపు చూస్తుంటే.. మీరేంటి నన్ను పక్కకు చూడమంటున్నారు' అని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగక.. రోజంతా మీ కళ్లలోకే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. అజంఖాన్ క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అయితే అజంఖాన్ మాత్రం తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు.
First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...