ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాపై బీజేపీ విమర్శలు...

తన బంధువు ఢిల్లీకి వెళ్ళినా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఎందుకు బయట పెట్టలేదని బండి ప్రభాకర్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: April 2, 2020, 10:37 AM IST
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాపై బీజేపీ విమర్శలు...
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కుటుంబ సభ్యులను కాపాడుకోలేని డిప్యూటీ సీఎం ప్రజలకేమి చేస్తారని అన్నారు. డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనల్లో ఉన్నారని ఆరోపించారు. జిల్లాలో దారుణమైన పరిస్థితికి అధికారుల వైఫల్యమే కారణమని బీజేపీ నేత బండి ప్రభాకర్ విమర్శించారు. నూర్జాహాన్ కళ్యాణ మండపంలో రహస్యంగా మకాం వేసిన వారెవరని ప్రశ్నించారు. పోలీసులు నిగ్గు తేల్చకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. 30 మంది మత ప్రచారకులకు ఆశ్రయం కల్పించిందెవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తన బంధువు ఢిల్లీకి వెళ్ళినా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఎందుకు బయట పెట్టలేదని బండి ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రాణాలు గుప్పెట్లో బ్రతుకుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని డిల్లీకి వెళ్లిన వారి పేర్లు డిప్యూటీ సీఎం బయట పెట్టాలని అన్నారు. బాధ్యత కలిగిన హాదాలో ఉన్న కమీషనర్ 30మంది మత ప్రచారాలను ఎక్కడికి తరలించారంటే సమాధానం లేదని విమర్శించారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలే వణికిపోతుంటే దాన్ని సీఎం జగన్ తేలికగా తీసుకోవడం సరికాదని బీజేపీ నేత బండి ప్రభాకర్ అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: April 2, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading