కేసీఆర్ ‘అసలైన పాలన’పై బండారు దత్తాత్రేయ విమర్శలు

ఆగస్టు 15 తర్వాత అసలైన పాలన చూస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ అనటం అభ్యంతరకరంగా ఉందని బండారు దత్తాత్రేయ విమర్శించారు.

Kishore Akkaladevi | news18-telugu
Updated: July 20, 2019, 1:14 PM IST
కేసీఆర్ ‘అసలైన పాలన’పై బండారు దత్తాత్రేయ విమర్శలు
బండారు దత్తాత్రేయ(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ అసెంబ్లీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ వ్యవహారం ఆశ్చర్యం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 తర్వాత అసలైన పాలన చూస్తారనటం అభ్యంతరకరంగా ఉందని దత్తాత్రేయ విమర్శించారు. ఆగస్టు 15 తరువాత అసలైన పాలన అంటే... ఈ ఐదున్నరేళ్లు నకిలీ పాలన చేశారా అని ప్రశ్నించారు. ఈఎస్‌ఐలో అవినీతిపై సీబీఐ విచారణ కోరే ధైర్యం కేసీఆర్‌కు లేదని దత్తాత్రేయ ధ్వజమెత్తారు. నూతన మున్సిపల్‌ చట్టంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతాయని దత్తాత్రేయ అన్నారు. బీజేపీపై కేటీఆర్‌ వ్యాఖ్యలు అహంకారపూరితమని దత్తాత్రేయ మండిపడ్డారు. త్వరలో మెజార్టీ మున్సిపాలిటీలను గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>