వైసీపీని టెన్షన్ పెడుతున్న బీజేపీ నేత... ఏం జరుగుతోంది ?

ఏపీకి చెందిన ఓ బీజేపీ నేత వ్యవహారం వైసీపీని టెన్షన్ పెడుతోందనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: June 5, 2020, 4:03 PM IST
వైసీపీని టెన్షన్ పెడుతున్న బీజేపీ నేత... ఏం జరుగుతోంది ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి బీజేపీ కూడా విపక్షమే. అయితే కేంద్రంలో మాత్రం వైసీపీ నేతలకు బీజేపీకి సానుకూల సంబంధాలే ఉన్నాయనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. అందుకే ఏపీలోని బీజేపీ నేతలపై విమర్శించే అధికార వైసీపీ.. కేంద్రంలోని బీజేపీ నేతలను మాత్రం అంతగా విమర్శించిన సందర్భాలు లేవనే చెప్పాలి. జాతీయస్థాయిలో తమ అవసరాలకు తగ్గట్టుగా బీజేపీతో వైసీపీ సంబంధాలు కొనసాగుతున్నాయనే వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీకి చెందిన ఓ బీజేపీ నేత వ్యవహారం వైసీపీని టెన్షన్ పెడుతోందనే టాక్ వినిపిస్తోంది. గతంలో బీజేపీ తరపున చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించిన మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావు... కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు అసలు కారణం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఆయన బీజేపీ తరపున ఇంప్లీడ్ అవుతుండటమే.

హైకోర్టులో ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన కామినేని శ్రీనివాసరావు... తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి తీసుకునే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యానని స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... బీజేపీ నేత కామినేని సుప్రీంలోనూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన తరువాత సైతం తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి తీసుకునే ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నానని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే కామినేని పదే పదే ఈ కేసులో ఇన్వాల్వ్ కావడమంటే... ఈ విషయంలో బీజేపీ అధినాయకత్వం వైసీపీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందా అనే చర్చ సాగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: June 5, 2020, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading