• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • BJP LEADER AND EX MINISTER DK ARUNA FIRES ON TELANGANA CM KCR FOR SALARIES CUT IN TELANGANA AK

ఇదేనా వారికిచ్చే బహుమతి... అప్పుడే అలా చేయాలి... కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్

డీకే అరుణ, కేసీఆర్

వెంటనే ఉద్యోగుల వేతనాల కోతను ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

 • Share this:
  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి, బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడి ఆర్టికల్ 360 అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించేందుకు అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలోనే లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఇలాంటి కోతలు విధించి సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని కేసీఆర్‌ను డీకే అరుణ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని... కరోనా పై ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని డీకే అరుణ ప్రశ్నించారు.

  వెంటనే ఉద్యోగుల వేతనాల కోతను ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడుతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. స్వయంగా ప్రధాన మంత్రి, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కోత విధించారు మీకు ఎలా వేతనాలు ఇవ్వాలని ప్రవేట్ ఉద్యోగులను ఆయా యాజమాన్యాలు అంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.

  ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఆర్థిక లోటు అనటం విడ్డురంగా ఉందని వ్యాఖ్యానించారు. కేవలం వారం రోజులు మధ్యం దుకాణాలు బంద్ చేస్తే రాష్ట్రంలో ఆర్థిక లోటు వచ్చిందా ? అని నిలదీశారు. రాష్ట్రంలో వారం రోజుల లాక్ డౌన్ కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ? అని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగైదు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
  Published by:Kishore Akkaladevi
  First published: