తప్పుంటే ఎన్‌కౌంటర్ చేయండి... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

తాను అజ్ఞాతంలో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని అన్నారు.

news18-telugu
Updated: December 11, 2019, 12:16 PM IST
తప్పుంటే ఎన్‌కౌంటర్ చేయండి... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
వివేకా హత్య కేసులో ఒక్క శాతం ప్రమేయం ఉందని నిరూపణైతే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని బీజేపీ నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం నా పై కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఈ నెల 6నే విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా జమ్మలమడుగు డీఎస్సీ కోరారని... డిసెంబరు 6న నేను ఢిల్లీలో ఉండటం వల్ల హాజరుకాలేదని ఆదినారాయణరెడ్డి అన్నారు. నేడు లేదా రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకమ్మని సిట్ కోరిందని తెలిపారు విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇచ్చారని విమర్శించారు. తనకు మాత్రమే 161 సీఆర్సీ కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

తాను అజ్ఞాతంలో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని...వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో వారి అంతరాత్మకే తెలుసని అన్నారు. టీడీపీ హయాంలో సిట్ వద్దు సీబీఐ కావాలని అడిగిన వారు నేడు సిట్ కావాలని అడగటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సిట్ పైన ఎవరికీ అవగాహన లేదన్న ఆదినారాయణరెడ్డి.వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తన తప్పుంటే ఎన్ కౌంటర్ చేసుకోవచ్చని అన్నారు.

First published: December 11, 2019, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading