కాషాయంలో కలిసిపోయిన విపక్షాలు.. బీజేపీ నేత మ్యాజిక్

చివరకు బీజేపీ జెండా మాత్రమే ఆయన చేతిలో కనిపించింది. విపక్షాల జెండాలు మాయమయ్యాయి. ఉపఎన్నికల్లో ఇదే జరగబోతోందని.. ఎన్ని పార్టీలు పోటీచేసినా మళ్లీ బీజేపీనే గెలుస్తుందని చెప్పారు .

news18-telugu
Updated: October 18, 2019, 4:01 PM IST
కాషాయంలో కలిసిపోయిన విపక్షాలు.. బీజేపీ నేత మ్యాజిక్
బీజేపీ నేత మ్యాజిక్ షో
  • Share this:
ఎన్నికల సమయంలో పార్టీలు వినూత్న ప్రచారాలు చేస్తుంటాయి. ర్యాలీలు, ఇంటింటి ప్రచారాల్లో వెరైటీగా ఓట్లను అభ్యర్థిస్తుంటారు నేతలు. తాజా యూపీలోని రాంపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నేత వినూత్న ప్రచారంచేసి అందరినీ ఆకట్టుకున్నారు. సభా వేదికపై అజయ్ దివాకర్ చేసిన మ్యాజిక్‌ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఇలా ఎన్ని పార్టీలు చేసినా.. విజయం మాత్రం బీజేపీనే అన్న కాన్సెప్ట్‌తో ఇంద్రజాలాన్ని ప్రదర్శించారు. ఆ మ్యాజిక్‌ను చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు విజిల్స్,చప్పట్లలతో అజయ్‌ని అభినందించారు.

అజయ్ దివాకర్ తన చేతిలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ జెండాలను తీసుకున్నారు. విపక్షాల జెండాలను కాషాయం జెండాలో చుట్టేసి గట్టిగా విదిల్చాడు. ఐతే చివరకు బీజేపీ జెండా మాత్రమే ఆయన చేతిలో కనిపించింది. విపక్షాల జెండాలు మాయమయ్యాయి. ఉపఎన్నికల్లో ఇదే జరగబోతోందని.. ఎన్ని పార్టీలు పోటీచేసినా మళ్లీ బీజేపీనే గెలుస్తుందని చెప్పారు అజయ్ దివాకర్. కాగా, రాంపూర్‌లో ఎస్పీ నేత అజాంఖాన్ భార్య తంజీన్ ఫాతిమ బరిలో ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి భూషణ్ పోటీచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాంపూర్‌తో పాటు మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబరు 21న పోలింగ్ జరగనుండగా..అక్టోబరు 24న ఫలితాలు వెలువడతాయి.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు