ఏపీలో బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కలసికట్టుగా ముందుకు వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: August 7, 2020, 7:53 PM IST
ఏపీలో బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ...
పవన్ కళ్యాణ్, సోమువీర్రాజు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కలసికట్టుగా ముందుకు వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకొని అడుగులు వేస్తామని తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో పవన్ కల్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన్ని పవన్ కల్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి, రాష్ట్ర ఆర్థిక స్థితి, కేంద్ర నిధులను రాష్ట్రంలో వ్యయం చేస్తున్న తీరు, వర్తమాన రాజకీయ స్థితిగతులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఈ సమావేశంలో పలు అంశాలపై కలిసి పని చేయడం గురించి మాట్లాడుకున్నాం. అమరావతిలోని రైతుల సమస్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మా మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మరింత కూలంకషంగా చర్చిస్తాం. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు, బీజేపీ సభ్యులతో కలసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం” అని అన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికంగా బలపడేందుకు అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం. అన్ని వనరులూ, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జనసేన, బీజేపీ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. వాటికి కేంద్ర ఆలోచనలను మిళితం చేసి... కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్న తీరును, నరేంద్ర మోదీ ఆలోచనలను పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రజల ముందుకు తీసుకువెళ్తాం. 2024నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దేందుకు ఒక ప్రణాళిక తీసుకుంటాం. అమరావతి విషయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ రైతాంగానికి సంబంధించిన అంశాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారికి ఏ విధమైన సాయం చేయగల అవకాశం ఉందో ఆలోచన చేస్తాం. వారికెలాంటి నష్టం లేని ఆలోచనను తెలియచేసే ప్రయత్నం చేస్తాం” అని అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 7, 2020, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading