స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ - జనసేన సీట్ల లెక్కలు...

బీజేపీ, జనసేన మధ్య సీట్ల పొత్తుల మీద చర్చలు జరిపారు.

news18-telugu
Updated: March 6, 2020, 10:20 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ - జనసేన సీట్ల లెక్కలు...
పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు, ఏయే సీట్లలో పోటీ చేయాలనే అంశంపై భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీ నేతలు సమావేశమై చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు మధ్య చర్చలు జరిగాయి. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటు గురించి చర్చించుకున్నాం . ఈ నెల 8న విజయవాడలో విస్తృత స్థాయిలో మరోసారి చర్చలు జరుపుతాం. ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. ప్రజల ముందు సరైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబడతాం.’ అని భేటీ తర్వాత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 6, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading