బీజేపీ - జనసేన లాంగ్ మార్చ్ వాయిదా... కొత్త డేట్?

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా బీజేపీ - జనసేన సంయుక్తంగా చేపట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది.

news18-telugu
Updated: January 25, 2020, 2:22 PM IST
బీజేపీ - జనసేన లాంగ్ మార్చ్ వాయిదా... కొత్త డేట్?
పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణ
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా బీజేపీ - జనసేన సంయుక్తంగా చేపట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఫిబ్రవరి 2న ఆ రెండు పార్టీలు లాంగ్ మార్చ్ చేపట్టాయి. అయితే, ఆ లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ప్రకటించారు. ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ప్రస్తుతం దీన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి. ఇటీవల బీజేపీ - జనసేన నేతలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం రాష్ట్రంలో రెండు పార్టీలు కలసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఆ భేటీలోనే ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు అది వాయిదాపడినట్టు బీజేపీ ప్రకటించింది. జనసేన నుంచి అధికారికంగా ఈ ప్రకటన వెలువడలేదు. అయితే, లాంగ్ మార్చ్ వాయిదా పడడానికి కారణం ఏంటి? మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే ఆసక్తి నెలకొంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 25, 2020, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading