BJP IS PLANNING TO STRENGTHEN IN AP AS PARTY LEADERS MADE STRONG ALLEGATIONS ON YSRCP AND TDP FULL DETAILS HERE PRN GNT
AP BJP: ఏపీలో బీజేపీ వ్యూహం అదేనా..? కమలనాథులు టార్గెట్ రీచ్ అవుతారా..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ (BJP) అవతరించనుందా..? వైసీపీ (YCP), టీడీపీ (TDP) లను సమానదూరంలో ఉంచాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా..? జనాగ్రహ సభలో ఆపార్టీ కీలక నేతల వ్యాఖ్యల వెనక పరమార్ధం ఏమిటి..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ (BJP) అవతరించనుందా..? వైసీపీ (YCP), టీడీపీ (TDP) లను సమానదూరంలో ఉంచాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా..? జనాగ్రహ సభలో ఆపార్టీ కీలక నేతల వ్యాఖ్యల వెనక పరమార్ధం ఏమిటి..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశాలపైనే చర్చ జరుగుతోంది. విజయవాడ లో బీజేపీ నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ఆపార్టీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. కేంద్రమాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ఆంధ్రాలో బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకే అంటూ వ్యాఖ్యానించడంతో బీజేపీ-వైసీపీ మధ్య దూరం పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కమలనాథులు వరుస పెట్టి మరీ తీవ్రవిమర్శలు చేశారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని... రాష్ట్రంలో అవినీతి,అరాచకం రాజ్యమేలుతున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు చేస్తున్న పథకాలకు కూడా జగన్ తన పేరు వేసుకుంటున్నారని.., నద్యపాన నిషేధం అంటూ ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని మండిపడుతున్నారు. అంతేకాదు మద్యంపై వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వం వెంపర్లాడుతోందని.., రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి జరగాలంటే బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పనిలోపనా టీడీపీని కూడా బీజేపీ టార్గెట్ చేసింది. 2014 లో మోడి ప్రాభవంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న బీజేపీ నేతలు... ఏపీలో ఆ పార్టీకి సీన్ లేదని తేల్చిచెబుతున్నారు.
ఐతే గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఇటు వైసీపీ.. అటు టీడీపీని తీవ్రంగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బీజేపీకి ఏపీలో పెద్దగా పట్టులేదనే చెప్పాలి. అందుకే జనసేనతో పొత్తుపెట్టుకుందన్న వాదన కూడా ఉంది. ఇటీవల టీడీపీ.. బీజేపీ పొత్తుపెట్టుకుంటున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అటు జగన్ కూడా బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. నేరుగా మద్దతు తెలపకపోయినా బీజేపీకి అవసరమైనప్పుడు బయటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీలపై కమనాథులు విరుచుకపడటం వెనుక వ్యూహం ఏంటనేది తెలియడం లేదు.
ఎంతప్రయత్నం చేసినా ఏపీలో బీజేపీకి ఎదుగుబొదుకు లేకపోవడంతో పార్టీ పెద్దల డైరెక్షన్లో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఏరాజకీయ పార్టీతో పొత్తుపెట్టుకున్నా బీజేపీకి ఏమీ ఒరగడం లేదు. ఈ నేపథ్యంలో సొంతగానే ఎదగాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏపీలో బలంపై ఆ పార్టీ నేతలను ప్రశ్నించగా.. గతంలో 2 సీట్లకే పరిమితమైన తాము.. దేశాన్నే పాలిస్తున్నామని.. ఏపీలో కూడా అదే ఫార్ములాను వర్కవుట్ చేస్తామని ధీమాగా చెబుతున్నారు. మరి బీజేపీ రాజకీయ వ్యూహం ఏపీలో ఎలా అమలవుతుందో వేచి చూడాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.