మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేసిన బీజేపీ..

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేసిన బీజేపీ..

మహారాష్ట్ర గవర్నర్‌ను కలసి తన రాజీనామాను అందజేస్తున్న ఫడ్నవీస్ (File)

అయోధ్య తీర్పు తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరగొచ్చని అంచనా వేశారు. కానీ,

 • Share this:
  మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ చేతులు ఎత్తేసింది. తమకు సరైన సంఖ్యాబలం లేనందును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామంటూ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారిని కలిసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ నేతృత్వంలోని బీజేపీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తమకు సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నట్టు చెప్పారు. బీజేపీ - శివసేనకు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు తీర్పు చెప్పారని, కానీ, శివసేన ఆ తీర్పు చెప్పిన ప్రజలను అవమానిస్తోందని చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. ఒకవేళ శివసేన పార్టీ.. కాంగ్రెస్ - ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము బెస్ట్ విషెస్ చెబుతామని చెప్పారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో పాటు శివసేన తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని భీష్మించింది. ఈ క్రమంలో చర్చలు సఫలం కాలేదు. అసెంబ్లీ గడువు ముగిసిపోవడంతో సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోషియారి.. అత్యధిక స్థానాలు గెలుచుకున్నబీజేపీని ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. అయితే, అసలు ప్రభుత్వ ఏర్పాటు చేయకముందే బీజేపీ తప్పుకొంది.

  మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ, శివసేనకు కలిపి 161 సీట్లు వచ్చాయి. అయితే, తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని శివసేన డిమాండ్ చేయడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఎన్నికలకు ముందు జరిగిన చర్చల్లో అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని బీజేపీ చెబుతుండగా, సాక్షాత్తూ అమిత్ షా హామీ ఇచ్చారని శివసేన స్పష్టం చేస్తోంది. దీంతో పీటముడి వీడలేదు.

  అయోధ్య తీర్పు తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరగొచ్చని అంచనా వేశారు. అయితే, శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చూస్తే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ‘మొదట మందిరం నిర్మాణం, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు. అయోధ్యలో మందిరం, మహారాష్ట్రలో ప్రభుత్వం.’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: