ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సుష్మా, ఆడ్వాణీ, జోషీలకు పెద్దరికం..!

మురళీమనోహర్ జోషి, ఎల్ కే ఆడ్వాణీ(File)

PM Modi News: మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రనేతలైన ఆడ్వాణీ, సుష్మా, జోషిలను పెద్దల సభ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

  • Share this:
బీజేపీలో వ‌ృద్ధులంతా ఇంటి దారి పడుతున్నారు. 75 ఏళ్లు దాటితే లోక్‌సభ టికెట్ ఇచ్చేది లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడంతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. అందులో మోదీ గురువు ఎల్కే ఆడ్వాణీకి కూడా మినహాయింపు లభించలేదు. కరెక్టుగా చెప్పాలంటే వయసు పరిమితి తొలి ప్రభావం ఆయన మీదే పడింది. ఆ తర్వాత మురళీ మనోహర్ జోషీ కూడా పక్కకు జరగాల్సి వచ్చింది. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, అనారోగ్యంతో జైట్లీ, సుష్మాస్వరాజ్ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, షా ద్వయంపై విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్లను కావాలనే పక్కన పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే, మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రనేతలైన ఆడ్వాణీ, సుష్మా, జోషిలను పెద్దల సభ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల్లో ఆడ్వాణీ గాంధీనగర్ సీటు అమిత్ షాకు కేటాయించగా, జోషి సీటును 2014లోనే మోదీ దక్కించుకున్నారు. వయోభారంతో ఆడ్వాణీ, జోషి ఈ ఎన్నికల్లో వారికి టికెట్ కేటాయించలేదు. దీంతో అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆ ముగ్గురు నేతలను పెద్దల సభకు నామినేట్ చేయాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వారంలో జరిగే పార్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
First published: