#Battle2019: రామాలయ నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్న అమిత్ షా... కాంగ్రెస్ కేసులతో అడ్డుకుంటోందని ఫైర్

రామ జన్మభూమి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అమిత్ షా విమర్శించారు. తాము రామ మందిరం నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటే... కాంగ్రెస్ కేసులతో దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

news18-telugu
Updated: January 30, 2019, 4:54 PM IST
#Battle2019: రామాలయ నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్న అమిత్ షా... కాంగ్రెస్ కేసులతో అడ్డుకుంటోందని ఫైర్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
  • Share this:
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామ జన్మభూమికి సంబంధించి వివాదం లేని 42 ఎకరాల స్థలం అప్పగింత కోసం సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసిందని అమిత్ షా అన్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని అమిత్ షా మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన పలువురు లాయర్లు... సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు.

రామ జన్మభూమి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అమిత్ షా విమర్శించారు. రైతులు పండించిన పంటకు బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ కేంద్రం అధిక నిధులు ఇస్తోందని ఆయన తెలిపారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా... ఆ వర్గాల్లోని పేదలకు కూడా న్యాయం జరుగుతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు తమ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపామని వివరించారు.

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో నేరస్థులను చూసి పోలీసులు భయపడేవారని... ఇప్పుడు నేరస్థులు పోలీసులను చూసి భయపడి లొంగిపోతున్నారని అమిత్ షా అన్నారు. బీజేపీ బలంగా ఉందన్న భయంతోనే విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని... ఒకప్పుడు బూత్ స్థాయి నాయకుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని అయ్యానంటే అది బీజేపీలోనే సాధ్యమని ఆయన తెలిపారు.

First published: January 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading