టీడీపీకి షాక్... బీజేపీ జనసేన భేటీలో అంతా వాళ్లే...

జనసేనతో కలిసి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... ఈ క్రమంలో టీడీపీతో మళ్లీ పొత్తు అవకాశం ఉండకూడదని గట్టిగానే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: January 16, 2020, 5:10 PM IST
టీడీపీకి షాక్... బీజేపీ జనసేన భేటీలో అంతా వాళ్లే...
జనసేనతో భేటీ కోసం వస్తున్న బీజేపీ నేతలు
  • Share this:
ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఎన్నికలకు మరికొన్ని ఏళ్లు ఉండగానే... రాష్ట్రంలో రాజకీయంగా కలిసి ప్రయాణం చేయాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని ప్రకటించేందుకు విజయవాడలో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. మూడు గంటలపాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు బీజేపీ, జనసేన నాయకులు. అయితే ఈ భేటీలో జనసేనతో చర్చించేందుకు బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిన నేతలను బట్టి చూస్తే... ఆ పార్టీ నాయకత్వం టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జనసేనతో భేటీ కోసం బీజేపీ తరపున ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, పురంధేశ్వరిలను ఎంపిక చేశారు. ఏపీలో బీజేపీలో వీరంతా బలమైన నాయకులా ? కాదా ? అనే విషయాన్ని పక్కనపెడితే... వీరంతా టీడీపీని గట్టిగా వ్యతిరేకించే నాయకులు. టీడీపీ అంటేనే ఒంటి కాలిపై లేచే నాయకులుగా వీరికి గుర్తింపు ఉంది. అలాంటి వీరిని ఈ సమావేశానికి ఎంపిక చేయడం ద్వారా బీజేపీ నాయకత్వం తమ పార్టీ క్యాడర్‌తో పాటు టీడీపీకి కూడా స్పష్టమైన సంకేతాలు పంపిస్తోందనే ప్రచారం జోరందుకుంది.

తాము భవిష్యత్తులో మరోసారి టీడీపీతో జట్టుకట్టే అవకాశం ఉండదని స్పష్టం చేసిన బీజేపీ... అందుకు తగ్గట్టుగానే బీజేపీ, జనసేన కీలక భేటీకి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారిని పక్కనపెట్టిందని చర్చ సాగుతోంది. మొత్తానికి జనసేనతో కలిసి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... ఈ క్రమంలో టీడీపీతో మళ్లీ పొత్తు అవకాశం ఉండకూడదని గట్టిగానే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>