తెలంగాణలో బీజేపీ ఆశలన్నీ రెండు సీట్లపైనే...

Lok sabha election results 2019 | తెలంగాణలో ఈ సారి తమ సీట్ల సంఖ్య పెరుగుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. తమ కంచుకోట అయిన సికింద్రాబాద్‌తో పాటు మహబూబ్ నగర్ సీటు ఈ సారి తమ ఖాతాలోకి వచ్చిపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 8:09 AM IST
తెలంగాణలో బీజేపీ ఆశలన్నీ రెండు సీట్లపైనే...
అమిత్ షా, మోదీ
news18-telugu
Updated: May 23, 2019, 8:09 AM IST
లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉంటాయనే విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే తెలంగాణలో ఈ సారి తమ సీట్ల సంఖ్య పెరుగుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. తమ కంచుకోట అయిన సికింద్రాబాద్‌తో పాటు మహబూబ్ నగర్ సీటు ఈ సారి తమ ఖాతాలోకి వచ్చిపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సికింద్రాబాద్ స్థానం నుంచి ఈసారి సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు బదులుగా మరో ముఖ్యనేత కిషన్ రెడ్డి బరిలోకి దిగారు.

తన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నా... తాను పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ తమ ఖాతాలో వచ్చిపడుతుందని భావిస్తున్న మరో స్థానం మహబూబ్ నగర్. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి డీకే అరుణ ఇక్కడి నుంచి పోటీ చేయడమే. గతంలో బీజేపీ ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసిన గెలవడం... ఈ సారి డీకే అరుణ బరిలో ఉండటంతో ఈ సారి పాలమూరు సీటుపై కమలనాథులు బాగానే ఆశలు పెట్టుకున్నారు.

పోలింగ్ సరళి కూడా తమకు అనుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సైతం తెలంగాణలో తాము రెండుస్థానాలు కచ్చితంగా గెలుస్తామంటూ పరోక్షంగా సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ సీట్లలో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మరి... బీజేపీ నమ్మకం ఎంతవరకు నెరవేరుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.



First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...