తమ మీద పడిన మచ్చను చెరిపేసుకున్న బీజేపీ...

ఉప ఎన్నికలు బీజేపీకి కలసి రావనే సెంటిమెంట్ రాజకీయవర్గాల్లో ఉంది. అయితే, ఆ సెంటిమెంట్‌ను కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బ్రేక్ చేశాయి.

news18-telugu
Updated: December 9, 2019, 10:14 PM IST
తమ మీద పడిన మచ్చను చెరిపేసుకున్న బీజేపీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు కలసి రావు అనేది ఓ సెంటిమెంట్. గతంలో చాలా చోట్ల ఉప ఎన్నికల్లో ఓడిపోయాయి. అందులో చాలా మంది ముఖ్యనేతల స్థానాలు కూడా గల్లంతయ్యాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్‌లో కూడా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైదంటేనే ఆ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో చెప్పుకోవచ్చు. అలాగే, కొన్ని రోజుల క్రితం గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆరు సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే, మూడు చోట్ల బీజేపీ ఓడిపోయింది. అల్పేష్ ఠాకూర్ లాంటి నేత కూడా పరాజయం చెందారు. అయితే, తాజాగా కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి బూస్ట్ ఇచ్చాయి. 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అందులో 12 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో యడియూరప్ప ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది. బీజేపీకి బైపోల్స్ కలసి రావన్న వాదనకు ఈ గెలుపుతో చెక్ పడినట్టయింది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>