హోమ్ /వార్తలు /రాజకీయం /

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కమలం సునామీ.. 26కు 26 సీట్లను..

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కమలం సునామీ.. 26కు 26 సీట్లను..

అమిత్ షా, నరేంద్ర మోదీ..(File)

అమిత్ షా, నరేంద్ర మోదీ..(File)

Lok Sabha Elections 2019: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన ప్రభావం చూపిస్తుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. అయితే, ఈ సారి అలాంటి ఫలితాలే పునరావృతం అయితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మోదీ-షా జోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఇంకా చదవండి ...

    గుజరాత్.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం.. బీజేపీకి కంచుకోట. అమిత్ షా వ్యూహాలు.. మోదీ మేనియాతో కాషాయ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు చిన్న ఝలక్ ఇచ్చారు. మొత్తం 182 సీట్లకు గానూ 99 సీట్లను మాత్రమే దక్కించుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో 115 సీట్లు గెలుచుకోగా, గత ఎన్నికలకు వచ్చేసరికి 16 సీట్లు తగ్గాయి. 77 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన ప్రభావం చూపిస్తుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. అయితే, ఈ సారి అలాంటి ఫలితాలే పునరావృతం అయితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మోదీ-షా జోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో 26కు 26 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో గుజరాత్‌లో కాషాయ పార్టీ 25 నుండి 26 స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగానే బీజేపీ దూసుకుపోతోంది.


    ఫలితాలపై పాటీదార్ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ లీడర్ హార్దిక్ పటేల్ స్పందించారు. తాజా ఫలితాలతో కాంగ్రెస్ ఒక్కటే ఓడిపోలేదని, దేశ ప్రజలంతా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఉద్యోగం, విద్య, ప్రజలకు సంబంధించిన ప్రతీ ఒక్క సమస్య ఓడిపోయిందని అన్నారు. ఇదిలా ఉండగా, రాజ్‌కోట్ కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ కగ్థారియా కుమారుడు చనిపోవడంతో గెలుపును సెలెబ్రేట్ చేసుకోవద్దని బీజేపీ నిర్ణయించుకుంది.    First published:

    Tags: Amit Shah, Bjp, Congress, Gujarat Lok Sabha Elections 2019, Pm modi

    ఉత్తమ కథలు