Home /News /politics /

BJP FUMES OVER RAHUL GANDHIS FACEBOOK CONTROLLER CHARGE CALLS CONGRESS LEADER LOSER WHO CRIBS SK

ఫేస్‌బుక్, వాట్సప్‌పై రాహుల్ సంచలన ఆరోపణలు.. బీజేపీ చేతిలో కీలుబొమ్మ

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

ఫేస్‌బుక్‌లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనం రాసింది.

    ఫేస్‌బుక్, వాట్సప్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఈ రెండింటినీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఫేస్‌బుక్, వాట్సప్ వేదికగా బీజేపీ తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలను వ్యాప్తి చేస్తూ ఎన్నికలను ప్రభావితం చేస్తారని ట్విటర్ వేదికగా బాంబు పేల్చారు రాహుల్ గాంధీ. ఫేస్‌బుక్ గురించి అసలు నిజాన్ని అమెరికాకు చెందిన 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' బయటపెట్టిందని పేర్కొన్నారు. అందులో వచ్చిన కథనాన్ని జతచేస్తూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.


    ఫేస్‌బుక్‌లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనం రాసింది. భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్‌ దెబ్బతినే ప్రమాదముందని ఫేస్‌బుక్ ప్రతినిధి అంఖీ దాస్‌ ఉద్యోగులతో అన్నట్లు అందులో ఉంది. తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రోహింగ్యా ముస్లింపై చేసిన ఫేస్‌బుక్ పోస్టులనూ ప్రస్తావించింది. రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది.

    ది వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ఆధారంగా ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. సొంత పార్టీని ప్రభావితం చేయలేని రాహుల్ గాంధీ.. బీజేపీ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని ఆరోపిస్తున్నాడంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికాతో ఒప్పందం చేసుకొని, డేటా చౌర్యం చేసి అడ్డంగా దొరికిపోయిన మీరు.. మమ్మల్ని విమర్శిస్తున్నారా? అంటూ ధ్వజమెత్తారు.

    ఫేస్‌బుక్, వాట్సప్‌పై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Facebook, Rahul Gandhi, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు