టార్గెట్ టీడీపీ... తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహం

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... ముందుగా బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

news18-telugu
Updated: August 11, 2019, 12:34 PM IST
టార్గెట్ టీడీపీ... తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహం
బీజేపీ చీఫ్ అమిత్ షా
  • Share this:
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... ముందుగా బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు టీటీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీటీడీపీ చాలా బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీని ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. పార్టీలోని ముఖ్యనేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొంతమంది టీడీపీ నేతలు, ఆ పార్టీకి దూరమైన మాజీ నాయకులు రాజకీయాల్లో సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిపై బీజేపీ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే టీడీపీకి రాజీనామా చేసిన రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోత్కుపల్లి నర్సింహులును కలిసి పార్టీలో చేరాలని కోరారు బీజేపీ నేతలు. మోత్కుపల్లి మాత్రమే కాదు... తెలంగాణలో టీడీపీకి చెందిన మరికొంతమంది నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల్లో చేరిన టీడీపీ నేతల్లో అసంతృప్తులను గుర్తించే పనిలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఆ నేతలను బీజేపీలోకి రప్పిస్తే... వారి ద్వారా బలమైన క్యాడర్ కూడా బీజేపీలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు బీజేపీ భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.


First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు