Tirupati ByPolls: బీజేపీ కొత్త ట్రెండ్.. ఉప ఎన్నిక ప్రచారంలో వైరల్

బీజేపీ డిజిటల్ ప్రచారం

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తన రూటే సపరేటు అంటోంది బీజేపీ. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు క్షేత్ర స్థాయి పర్యటనలు, ప్రచారాలతో పరుగులు పెడుతుంటే.. డిజిటల్ వేదికగా దూసుకుపోతోంది బీజేపీ.. మోదీని ప్రధానంగా చూపిస్తూ.. హ్యాస్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తోంది.

  • Share this:
    తిరుపతి ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులంతా నామినేషన్ వేసి ప్రచారంలో దూకుడు పెంచారు. ఇటు అధికార వైసీపీ ఇప్పటికే ఏడుగురు కీలక మంత్రులను రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో ఓట్లు పడేలా వారు అన్ని నియోజవర్గాలపై ఫోకస్ చేస్తున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం సైతం ఇప్పటికే కీలక నేతలు అందర్నీ తిరుపతిలోనే మోహరించింది. 8 జోన్లుగా విభించి ఒక్కో జోన్ బాధ్యతను ఒక్కో నేతకు అప్పచెప్పారు అధినేత చంద్రబాబు. ఇలా రెండు పార్టీల కీలక నేతలు ప్రచారంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతుంటే.. బీజేపీ మాత్రం తమ రూటే సపరేటు అంటోంది. ప్రచారానికి సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తొలిసారి కేంద్రంలో మోదీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన సోషల్, డిజిటల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది. అప్పట్లో #నమో అంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టించింది. ఇప్పుడు తిరుపతిలో కొత్త పల్లవి అందుకుంది.

    తెలంగాణలో దుబ్బాకలో విజయం సాధించి సత్తా చాటినట్టే.. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొంది ఏపీలోనూ కాలు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం సోషల్ మీడియాను ప్రధాన ప్రచార వేదికగా చేసుకుంటోంది. ప్రస్తుతం #మోదీ4తిరుపతి అనే హ్యాష్ ట్యాగ్ తో జనాల్లోకి దూసుకుపోతోంది. ప్ర్తస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్ ట్రెండింగ్‌ అవుతోంది. కేవలం 24 గంటల్లో 8 వేలకు పైగా ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్‌తో నమోదు అవ్వడం ట్రెండింగ్ గా మారింది.

    వాస్తవంగా చూస్తే ప్రస్తుతం రేసులో టీడీపీ, వైసీపీ కంటే బీజేపీ ప్రచారంలో వెనుకబడిందనే చెప్పాలి. కొన్ని నెలల కిందటే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ తరుపున నామినేషన్ వేసిన పనబాక లక్ష్మి దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాస్త ఆలస్యమే అయినా వైసీపీ తన పేరును ప్రకటించిన వెంటనే గురుమూర్తి సైతం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సైలెంట్ గా ప్రచారన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ బీజేపీ విషయానికి వస్తే అభ్యర్థి ప్రకటన విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మొదట జనసేన తరుపున అభ్యర్థిని పెడుతున్నట్టు ప్రచారం జరిగింది. సుదీర్ఘ చర్చల ద్వారా తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు జనసేనను ఒప్పించిన బీజేపీ.. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థిని ఖరారు చేయడానికి సమయం తీసుకుంది. తెరపైకి మూడు నాలుగు పేర్లు వచ్చినా.. చివరికి రత్రప్రభను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనా.. ప్రచారంలో దూకుడు పెంచలేదు. ఏపీ నేతలు సైతం ఎక్కడా ప్రచారాల్లో పాల్గొంటున్నట్టు కనిపించలేదు. అయితే అందుకు ప్రధాన కారణం.. బీజేపీ కేవలం డిజిటల్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకుంది.

    తిరుపతి లాంటి టెంపుల్ సిటీ అభివృద్ధి కేవలం మోదీతోనే సాధ్యం అని ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. స్పెషల్ ప్యాకేజ్ ద్వారా కేటాయించిన నిధులపై ఓ వీడియోను విడుదల చేసింది. తాజాగా #మోదీ4తిరుపతి అనే నినాదాన్ని వైరల్ చేస్తోంది బీజేపీ. జాతీయ స్థాయి విద్యాసంస్థలైన.. ఐఐటీ తిరుపతి, ఐసర్‌తో పాటు ఎలక్ట్రానిక్ మ్యాను ఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల ఏర్పాటు, రైల్వే మార్గాల అభివృద్ధి మొదలైన అంశాల్లో తిరుపతికి కేటాయించిన నిధులపై ట్వీట్ల ద్వారానే ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీ కోసం బీజేపీ ఏం చేసింది? ఇకపై చేయబోయే ప్రణాళికలను సైతం చెబుతూ డిజిటల్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఏపీకి కేంద్రం ఎంత సాయం చేస్తున్నా తగిన ప్రచారం రావడం లేదని బీజేపీ ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇలా తమ ప్రచారానికి డిజిటిల్ వేదికను వాడుకుంటున్నారు.

    బీజేపీ రాష్ట్ర అధికారిక ఖాతాతో పాటు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఇలా ఏ నాయకుడి ఖాతా చూసినా #మోదీ4తిరుపతి హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తూ సాంకేతిక సాయంతో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ-జనసేన వ్యూహాల్ని డిజిటల్ వేదికగా విమర్శిస్తున్న వారికి అదే వేదికగా కౌంటర్లు ఇస్తోంది. ప్రస్తుతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: