బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’... కిషన్ రెడ్డితో టీ టీడీపీ నేతల భేటీ

ఉత్తర తెలంగాణలోని మూడు లోక్ సభ స్థానాలైన అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో... అక్కడ మరింతగా విస్తరించేందుకు ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 31, 2019, 3:28 PM IST
బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’... కిషన్ రెడ్డితో టీ టీడీపీ నేతల భేటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ... రాష్ట్రంలో రాజకీయంగా మరింతగా బలం పెంచుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్‌లో కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి లభించడంతో సంబరాల్లో మునిగిపోయిన బీజేపీ శ్రేణులు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో మరింతగా బలపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీలో టీ టీడీపీ నేతలు కొందరు కిషన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీ టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన మాజీమంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేశ్ రెడ్డి కిషన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని మూడు లోక్ సభ స్థానాలైన అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో... అక్కడ మరింతగా విస్తరించేందుకు ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముందుగా టీడీపీ, కాంగ్రెస్ నాయకులను తమవైపు తిప్పుకోవాలని ఆ పార్టీ యోచిస్తోందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితిలో టీడీపీ ఉండటంతో... ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. మొత్తానికి కిషన్ రెడ్డిని కలిసిన టీ టీడీపీ నేతలు కేవలం ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకే పరిమితమవుతారా లేక త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారా అన్నది చూడాలి.

First published: May 31, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading