• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP FIRE BRAND LEADER SHATRUGHAN SINHA JOINS CONGRESS IN PRESENCE OF RAHUL GANDHI BA

రాహుల్ గాంధీని కలిసిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా

రాహుల్ గాంధీని కలిసిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా

రాహుల్ గాంధీని కలిసిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా

పాట్నా సాహిబ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అయిన శతృఘ్న సిన్హాకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు.

  • Share this:
    బీజేపీ నేత, బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆయన తర్వలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీతో మూడు దశాబ్దాలకుపైగా ఉన్న అనుబంధాన్ని పక్కనపెట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. బీహార్‌లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అయిన శతృఘ్న సిన్హా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. బీజేపీ నుంచి శతృఘ్న సిన్హా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, బీజేపీ అధిష్టానం మీద ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి పాట్నా సాహిబ్ నియోజకవర్గంలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌‌ను పాట్నా సాహిబ్ నుంచి బరిలో దింపుతోంది. దీంతో శతృఘ్న సిన్హా బీజేపీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. నవరాత్రికి పాజిటివ్ న్యూస్ చెబుతామన్న శతృఘ్న సిన్హా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాను పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

    First published: