బీజేపీ నాగార్జునసాగర్ అభ్యర్థి ఖరారు... ఎవరూ ఊహించని విధంగా..

ప్రతీకాత్మక చిత్రం

NagarjunaSagar By election: ఈ విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే వెనుకబడ్డ బీజేపీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించింది.

 • Share this:
  నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు రేపు చివరి తేదీ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే వెనుకబడ్డ బీజేపీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించింది. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా.. ఎవరూ ఊహించని విధంగా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. డాక్టర్ పనుగోతు రవికుమార్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ అంశంలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది.

  అంతకుముందు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై బీజేపీ తర్జనభర్జన పడింది. టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేంతవరకు ఎదురుచూసి ఆ తరువాత తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయాలని కమలనాథులు భావించారు. అయితే ఈ విషయంలో సీఎం కేసీఆర్ వారిని చివరివరకు టెన్షన్ పెట్టారు. నామినేషన్లకు రేపు చివరి తేదీ అనే సమయంలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టికెట్ ఖరారు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది.

  బీసీ వర్గానికి చెందిన భగత్‌కు టీఆర్ఎస్‌ టికెట్ ఇవ్వడంతో.. తాము కూడా అదే వర్గానికి చెందిన అంజయ్య యాదవ్‌కు టికెట్ ఇవ్వాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. సాగర్‌లో గతంలో పోటీ చేసిన నివేదితారెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించడంతో.. ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే చివరకు వీరిద్దరిలో టికెట్ ఎవరికీ ఇవ్వని బీజేపీ రవికుమార్‌ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది.
  Published by:Kishore Akkaladevi
  First published: