బీజేపీకి షాక్... వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబం...

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరనున్నారు. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 8:41 PM IST
బీజేపీకి షాక్... వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబం...
మాజీ బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరనుంది. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గంగరాజు కుమారుడు రంగరాజు, రామరాజుతోపాటు ఆయన సోదరులు కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే, గంగరాజు మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న కమలం నేతలకు ఈ ఘటన షాక్ ఇచ్చింది. గోకరాజు గంగరాజు 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. నర్సాపురం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కె.రఘురామకృష్ణం రాజు విజయం సాధించారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>